నవతెలంగాణ – బెజ్జంకి
దళిత బందు అందజేసి దళితుల శ్రేయస్సుకు ప్రభుత్వం కృషి చేయాలని వరంగల్ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డికి వినతిపత్రమందజేసి విజ్ఞప్తి చేయడానికి ప్రయత్నిస్తే దళిత బంధు సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు కొగిల మహేశ్ ను అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమని దళిత బందు రాష్ట్ర సలహాదారు దీటీ బాలనర్స్ మంగళవారం మండిపడ్డారు.అక్రమ అరెస్టులతో దళితుల ఆకాంక్షను అడ్డుకోలేరని.. వెంటనే లబ్దిదారులకు రెండవ విడత దళిత బంధు అందజేయాలని దీటీ బాలనర్స్ ప్రభుత్వాన్ని కోరారు.