నవతెలంగాణ – కోహెడ
మండలంలోని శనిగరం గ్రామ శివారులో అనుమతి లేకుండా ఇసుక తరలిస్తున్నTS36TA4959 నెంబర్ గల లారీని ఎస్సై అభిలాష్ శుక్రవారం పట్టుకున్నారు.అయన తెలిపిన వివరాల ప్రకారం శనిగరం పరిధిలోని శంకర్ర్ నగర్ నుంచి హైదరాబాద్ కు ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తున్నరని సమాచారం రావడంతో గ్రామ శివారులో ఆగి ఉన్న ఇసుక లారీ ని పోలీసులు పట్టుకున్నారు.ఎలాంటి అనుమతి పత్రాలు లేకపోవడంతో కేసు నమోదు చేసి లారీ ని పోలీస్ స్టేషన్ కు తరలించారు.అదేవిధంగా అనుమతి లేకుండా ఇసుకను రవాణా చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.