నవతెలంగాణ-కొడంగల్
గంజాయి అక్రమ రవాణా పై పోలీసు యంత్రాంగం ఉక్కు పాదం మోపుతుందని సీిఐ రాములు అన్నారు. శనివారం మండలంలోని రావులపల్లి చెక్ పోస్ట్ దగ్గర హెడ్ కానిస్టేబుల్ శివరాములు, కానిస్టేబుల్స్ నరేందర్ రెడ్డి, కష్ణలు వాహనాలను తనిఖీలు నిర్వహిస్తుండగా హెచ్‌ఎమ్ డీలక్స్ వాహనంపై ముగ్గురు వ్యక్తులు సేడం నుండి కొడంగల్ వైపు వెళ్తుండగా అక్రమంగా గంజాయి తరలిస్తూ పోలీసులకు పట్టుబడినట్లు ఎస్సై భరత్ రెడ్డితో కలిసి విలేకరుల సమావేశంలో తెలిపారు. సేడం తాలూ కా మదీనా గ్రామానికి చెందిన హుస్సేనప్ప (అఖిల్), అదే గ్రామానికి చెందిన నాగరాజు, రావులపల్లికి చెందిన దస్త ప్ప మదీనా గ్రామంలో ఉంటూ ముగ్గురు స్నేహితులు కలిసి గంజాయిని తరలిస్తుండగా పోలీసుల కు పట్టు బడడంతో పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లు తెలిపారు. ప్లాస్టిక్ బస్తాలో 2 కిలోల గంజాయిని, ద్విచక్ర వాహనా న్ని, 2 మొబైల్ ఫోన్లు సీజ్ చేసినట్లు తెలిపారు. గంజాయి విలువ రూ.40 వేలు ఉంటుందని తెలిపారు. గంజాయి తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. కొడంగల్ మండలంలోని మాటూర్, నీటూర్, రావుపల్లిల్లో అమ్ముతున్నట్లు తెలిపారు. విద్యా ర్థులు, యువకులు గంజాయికి బానిస కాకుండా జాగ్రత్త గా ఉండాలన్నారు. గంజాయి అమ్ముతున్న వ్యక్తుల పేర్లు పోలీసులకు సమాచారం అందిస్తే చెప్పిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతామన్నారు. గంజాయి అమ్ముతున్న వ్య క్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. గంజాయి అ మ్ముతూ పట్టుబడితే వారిపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేస్తామన్నారు. గంజాయిలో పట్టుబడిన నిధులపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.