నవతెలంగాణ- వలిగొండ రూరల్ : పేకాట ఆడుతూ అక్రమ మనీ బెట్టింగ్ కు పాల్పడుతున్న 11 మందిని స్థానిక పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం 11 మంది వ్యక్తులు మండలంలోని నరసాయగూడెం గ్రామ పరిధిలోని రహస్య ప్రదేశంలో పేకాట ఆడుతూ మనీ బెట్టింగుకు పాల్పడుతున్నారని తెలిసిన విశ్వసనీయ సమాచారం మేరకు స్థానిక పోలీసులు దాడి చేసి 11 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 7,300 నగదు, నాలుగు సెల్ ఫోన్లు,మూడు ద్విచక్ర వాహనాలు, నాలుగు పేకాట సెట్లను స్వాధీనం చేసుకొని సీజ్ చేసి కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు స్థానిక ఎస్సై యుగంధర్ తెలిపారు.