సెకండ్ ఏఎన్ఎంల అరెస్ట్ ..

– నోటిఫికేషన్ ను రద్దు చెయ్యాలని డిమాండ్
నవతెలంగాణ- నసురుల్లాబాద్ 
వైద్య ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న సెకండ్ ఏఎన్ఎం లను బాన్సువాడ డివిజన్ పరిధిలోని నసురుల్లాబాద్, బీర్కూర్ బాన్సువాడ, మండలల్లో పని చేస్తున్న సెకండ్ ఏఎన్ఎంలను పోలీసులు శుక్రవారం ముందస్తుగా అరెస్టు చేశారు. మరి కొంతమంది ఏఎన్ఎంలను గృహనిర్బంధం చేశారు. పలు సంఘలు ఇచ్చిన పిలుపు మేరకు రెండవ ఏఎన్ఎం లందరినీ బేషరతుగా రెగ్యులర్ చేయాలని, రాష్ట్ర ప్రభుత్వం జులై 26వ తేదీన విడుదల చేసిన నోటిఫికేషన్ ను 2/23 ని రద్దుచేయాలని కోరుతూ శుక్రవారం చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని తలపెట్టారు. ఈ సందర్భంగా బాన్సువాడ డివిజన్ వ్యాప్తంగా పోలీసులు అప్రమత్తమయ్యారు. ముట్టడి కార్యక్రమానికి తరలి వెళ్లకుండా సెకండ్ ఏఎన్ ఎం లను అరెస్టు చేశారు.