
మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటనలో ఒకరిని గురువారం అరెస్టు చేసినట్లు ఎస్సై ఎండీ ఆసీఫ్ తెలిపారు. ఎస్సై ఆసీఫ్ కథనం ప్రకారం.. మండలంలోని ఎల్బాక గ్రామానికి చెందిన కుర్ర వెన్నెలకు మానకొండూరు మండల కేంద్రానికి చెందిన కుర్ర రాజుతో వివాహైంది. కాగా వెన్నెలను భర్త రాజుతో పాటు అత్త కొమురమ్మ, మామ సమ్మయ్య, వారి బంధువు మణికంఠ వేధింపులకు గురి చేయగా గత సంవత్సరం నవంబర్ 22న పురుగుల మంధు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. కాగా మృతురాలి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేసి వెన్నెల భర్త రాజును ఇటీవల అరెస్టు చేయగా మణికంఠను గురువారం అరెస్ట్ చేసినట్లు ఎస్సై తెలిపారు.