– హుజురాబాద్ ఏసిపి జీవన్ రెడ్డి
నవతెలంగాణ-శంకరపట్నం : శంకరపట్నం మండలం మొలంగూర్ గ్రామంలో గోవును దొంగిలించి కోసి మాంసాన్ని విక్రయించిన నిందితులను జైలుకు పంపినట్లు, హుజరాబాద్ ఏసిపి జీవన్ రెడ్డి తెలిపారు కేశవపట్నం పోలీస్స్టేషన్లో బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, మండలంలోని మొలంగురు గ్రామానికి చెందిన గాజుల పద్మ ఆవును పెంచుతున్నారు. పశువుల పాకలో కట్టివేసిన ఆవు మంగళవారం తెల్లవారుజామున కనిపించకపోవడంతో కేశవపట్నం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న ఎస్ఐ లక్ష్మారెడ్డి, సిఐ సంతోష్,కుమార్, వివిధ కోణాల్లో విచారణ ప్రారంభించారు. గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు ఎజాస్ బేగ్ అలియాస్ సద్దాం , షేక్ తాజ్, మోరే మనోజ్, ఈనెల 1న అర్ధరాత్రి ఆవును దొంగిలించి వాదించారు కోసిన మాంసం విక్రయించాలన్న ఉద్దేశంతో నిందితులు ఆవును వధించారని పేర్కొన్నారు ఆవును కోసేందుకు ఉపయోగించిన కత్తులు, ఆవు మాంసం విక్రయించేందుకు ఉపయోగించిన వాహనం తో పాటు విక్రయించగా వచ్చిన సొమ్ము 5000 నిందితుల నుండి స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు 50 వేలు విలువచేసే గోవును చంపిన నిందితులపై చట్టం గోవు నిషేధిత చట్టం కింద కేసు నమోదు చేశామన్నారు. గోవులను రవాణా చేసిన వధించిన ఉక్కు పాదంతో అనచివేస్తామని తెలిపారు. గోవును వధించిన నిందితులను హుజురాబాద్ న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టగా నిందితులను గోవద నిషేధిత చట్టం కింద జైలుకు పంపినట్లు, పేర్కొన్నారు.ఈ సమావేశంలో హుజురాబాద్ రూరల్ సీఐ సంతోష్ కుమార్ ఎస్సై లక్ష్మారెడ్డి ఉన్నారు.