ఇంట్లో చొరబడి దొంగతనం చేసిన దొంగ అరెస్ట్..

The thief who broke into the house and stole it was arrested.నవతెలంగాణ – డిచ్ పల్లి.
రాత్రి  సమయములో ఇంట్లో ఎవరు లేనిదీ చూసి ఒక గుర్తు తెలియని దొంగ ఇంట్లోకి చొరబడి ఇంట్లో వాళ్ళు  దాచుకున్న బంగారు ఆబరణాలు, కోంత డబ్బును  దొంగిలించుకొని  ఏమి తెలియనట్లు ఉంటున్న వ్యక్తి ని చాకచక్యంగా ఇందల్ వాయి ఎస్ హెచ్ ఓ మనోజ్ కుమార్, సిబ్బంది పెట్టుకున్నారని డిచ్ పల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ కే మల్లేష్ తెలిపారు. సర్కిల్ ఇన్స్పెక్టర్ కే మల్లేష్, ఎస్ హెచ్ ఓ మనోజ్ కుమార్ తో కలిసి వివరాలను వెల్లడించారు.వారు తెలిపిన వివరాల ప్రకారం  ఇందల్ వాయి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇందల్ వాయి  గ్రామంలో ఆసాది రాజేశ్వరి ఇంట్లో  ఈ నేలా 25న రాత్రి ఇంట్లో చొరబడి  ఇంట్లో వాళ్ళు  దాచుకున్న బంగారు ఆబరణాలు, డబ్బులు  దొంగిలించుకొని పారిపోయినట్లు సర్కిల్ ఇన్స్పెక్టర్ కే మల్లేష్ వివరించారు.ఉదయం బాధితురాలు రాజేశ్వరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పిర్యాదు మేరకు ఇందల్ వాయి  ఎస్ హెచ్ ఓ మనోజ్ కుమార్ తన సిబ్బంది తో కలిసి చాక చక్యంగా  దొంగతనం చేసిన అదే గ్రామానికి చెందిన ఆసాది రాజేష్ ను పట్టుకొని విచారణ చేయగా దోంగలించిన  దొంగ సొత్తు ను నిజామాబాద్ తరుణ్ కు బంగారంను అమ్మినట్లు వివరించారు. దొంగ బంగారమని తెలిసికూడా  దొంగ వద్ద బంగారం కొనుగోలు చేసిన తరుణ్ నిజామాబాద్ కు   పట్టుకొని అయన నుండి దొంగిలించిన నగదును, బంగారం, ఒక మొబైల్ ఫోన్ ని రికవరీ చేసి వెంటనే నిందితుడుని రిమాండ్ కి తరలించినట్లు సర్కిల్ ఇన్స్పెక్టర్ కె మల్లేష్ పేర్కొన్నారు చాకచక్యంగా వ్యవహరించి రెండు రోజుల్లోనే కేసును చేదించిన ఇందల్ వాయి ఎస్ హెచ్ ఓ మనోజ్ కుమార్ కు, సిబ్బందికి అభినందించారు.