కార్యకర్తలను అరెస్టు చేయడం అన్యాయం..

Arresting activists is unfair.– ముధోల్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి కార్యకర్తలను విడిపించిన ఎమ్మెల్యే..
నవతెలంగాణ – ముధోల్
ప్రజాస్వామ్య బద్దంగా నిరసన తెలిపితే అరెస్ట్ చేయించడం సరికాదని ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ అన్నారు. ట్రిపుల్ ఐటీ ముట్టడికి ఏబీవీపీ పిలుపును ఇవ్వడంతో శనివారం పోలీసులు ఉదయం నుంచి  ఎక్కడికెక్కడ కార్యకర్తలను అరెస్టు చేశారు. హైదరాబాద్ నిజామాబాద్, పలు ప్రాంతాల నుండి  ఏబీవీపీ కార్యకర్తల రాగా, బాసరలో వారిని అరెస్టు చేసి, ముధోల్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.  ఈ విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ఉన్నప్పటికి  శనివారం సాయంత్రం హుటాహుటిన ముధోల్ పోలిస్ స్టేషన్ కు చేరుకొని ఏబీవీపీ కార్యకర్తలతో మాట్లాడారు. అనంతరం ఎ. ఎస్. పి. అవినాష్ కుమార్ తో మాట్లాడి వారిని విడిపించారు. బాసర రైల్వే స్టేషన్ కు  ప్రత్యేక బస్సు ఏర్పాటు చేయించి, ఏబీవీపీ కార్యకర్తలను వారి స్వగ్రామానికి స్వగ్రామాలకు  పంపించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామారావు పటేల్ మాట్లాడారు. ప్రజాస్వామ్యం బద్దంగా నిరసనలు తెలుపుతుంటే అరెస్టులు చేయడం  సమంజసం కాదన్నారు. ట్రిపుల్ ఐటీ లో సమస్యల రాజ్యమేలుతుంటే, పట్టించుకోవాల్సింది పోయి  ,ఆందోళన చేస్తున్న వారిని అదుపులో తీసుకోవడం తగదన్నారు .ఇకనైనా ట్రిపుల్ ఐటీ లో  ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఏబీవీపీ కార్యకర్తలకు  బిజెపి పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుదని ఎమ్మెల్యే పేర్కొన్నారు.ఈయన వెంట బిజేపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నారాయణ్ రేడ్డి, మండల బిజెపి అధ్యక్షుడు కోరిపోతన్న, నాయకులు తాటివార్ రమేష్, శ్రీనివాస్, జీవన్, పోతన్న ,తదితరులు, పాల్గొన్నారు.