– సంఘీభావం ప్రకటించిన మున్సిపల్ చైర్ పర్సన్, కౌన్సిలర్లు..
నవతెలంగాణ – వేములవాడ
న్యాయమైన డిమాండ్లు నెరవేర్చుకోవడానికి శాంతియుతంగా ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడానికి హైదరాబాదుకు వెళ్తున్న అర్పిలను మహిళా కానిస్టేబుళ్లు లేకుండా వారిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తీసుకురావడం దుర్మార్గమైన చర్య అని బి ఆర్ ఎస్ చైర్మన్ కౌన్సిలర్లు అన్నారు. ఈ సందర్భంగా చైర్మన్ ఆర్ మాధవి మాట్లాడుతూ.. అరకోర వేతనాలతో పట్టణ మహిళా స్వయం సహాయక సంఘాలలో పనిచేస్తున్నటువంటి ఆర్పిల సమస్యలను పరిష్కరించాలని వారు నేడు చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని నిర్వహించారని అన్నారు. వేములవాడ పట్టణంలో ఉన్నటువంటి 28మంది మహిళ ఆర్పీలను పట్టణ పోలీసులు ముందస్తుగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ దుర్మార్గ చర్య అని ఆవేదన వ్యక్తం చేశారు. పట్టణ మున్సిపల్ చైర్ పర్సన్ రామతీర్తపు మాధవితో పాటు కౌన్సిలర్లు తీవ్రంగా ఖండించారు. ఆర్పిల న్యాయమైనటువంటి డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. తమ హక్కుల కోసం పోరాటం చేస్తున్న ఆర్పిలను ముందస్తుగా అరెస్టు చేయడం రాష్ట్ర ప్రభుత్వం దుర్మార్గపు చర్యగా ఆమె అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్స్ నిమ్మశెట్టి విజయ్, మారం కుమార్, గోలి మహేష్, నాయకులు ముద్రకోల వెంకటేశం, వాసాల శ్రీనివాస్, సుంకపాక రాజు తోపాటు తదితరులు పాల్గొన్నారు.