అరెస్టులతో ప్రశ్నించే గొంతులను ఆపలేరు..

Arrests cannot stop questioning voices..– కాంగ్రెస్ మాయ మాటలు నమ్మి మోసపోయి గోస పడుతున్నారు
– అరెస్టై విడుదలైన మాజీ ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించిన మునుగోడు బీఆర్ఎస్ నాయకులు..
నవతెలంగాణ – మునుగోడు
బెటాలియన్ లో ఉద్యోగాలు చేస్తున్న పోలీసులు , వారి కుటుంబ సభ్యులు ఆందోళన చేపడుతుంటే మద్దతు తెలిపేందుకు వెళ్తున్న నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ని శనివారం అరెస్టు చేసి మునుగోడు పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రశ్నించే గొంతులను నొక్కేందుకు అరెస్టులతో ఆపలేరని అన్నారు. బెటాలియన్ కానిస్టేబుల్ లకు మద్దతు తెలిపేందుకు వెళ్తుండగా అరెస్టు చేయడం ఏంటని ప్రశ్నించారు. ప్రజల శ్రేయస్ కోసం అహర్నిశలు కృషి చేసే పోలీసులకే రక్షణ లేదంటే ఇది ప్రజా ప్రభుత్వమా అని నిలదీశారు .కాంగ్రెస్ మాయమాటలు నమ్మి మోసపోయి గోసపడుతున్నారు . అరెస్ అయ్యి  విడుదలైన కంచర్ల భూపాల్ రెడ్డికి , మాజీ నల్గొండ మున్సిపల్ చైర్మన్ సైదిరెడ్డికి , తెలంగాణ ఉద్యమకారుడు చెరుకు సుధాకర్ కు మునుగోడు బీఆర్ఎస్ నాయకులు సాల్వలు కప్పి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ ఈద నిర్మల శరత్ బాబు , మాజీ సర్పంచ్ గజ్జల బాలరాజ్ ,  బీఆర్ఎస్ మండల నాయకులు  ఎం అంజయ్య, మాజీ ఉపసర్పంచ్ లు మేకల శ్రీనివాస్ రెడ్డి, ఎల్లంకి యాదగిరి , ఎడవెల్లి సురేష్ , నియోజవర్గ యువజన నాయకులు అయితగొని విజయ గౌడ్ , నందిపాటి వెంకన్న, బోయపర్తి సురేందర్ తదితరులు ఉన్నారు.