నవ తెలంగాణ- నకిరేకల్
ఈనెల 29న నకిరేకల్ కు మంత్రులు హరీష్ రావు జగదీశ్ రెడ్డిలు రానున్నారు కట్టంగూరు మండలంలోని చెరువు అన్నారం గ్రామంలో రూ.101.62 కోట్లతో నిర్మిస్తున్న ఐటి పాముల ఎత్తిపోతల పథకానికి, రూ 5. 70 కోట్లతో నిర్మించే డిగ్రీ కళాశాల భవన నిర్మాణానికి మంత్రులు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం పట్టణంలో పిఆర్టియు భవనం, గ్రంథాలయం, ఎస్ టి ఓ కార్యాలయ భవనాలను ప్రారంభించనున్నారు. ఈ మేరకు మంగళవారం సాయంత్రం స్థానిక ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మినీ స్టేడియంలో సభ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల ప్రదీప్ రెడ్డి తో పాటు ప్రజా ప్రతినిధులు, బిఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.