నవతెలంగాణ – ఆర్మూర్
మున్సిపల్ పరిధిలోని కోట ర్మూర్ శివ పంచాయతన సహిత హనుమాన్ దేవాలయ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమంనకు ఈనెల 20 బుధవారం శ్రీ శ్రీ హంపి విరూపాక్ష విద్యారణ్య స్వామీజీ దేవత మూర్తుల యంత్ర ప్రతిష్ట తదితర కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు వి డి సి అధ్యక్షులు ఇట్టేడి గంగారెడ్డి ,కోశాధికారి తిరుపతి గౌడ్ లు ఆదివారం తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా నేడు నవగ్రహ గణపతి హోమం ,,మంగళవారం ప్రత్యేక పూజలు, 20వ తేదీ బుధవారం మహా పూర్ణాహుతి, అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. మాజీ సర్పంచ్ ఎం అనిల్ గౌడ్,పెరికిటుకు చెందిన తీగల నర్సారెడ్డి తదితరులు ప్రధాన దాతలు అని స్థానికులు ,భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని వారు కోరినారు.