పారిస్: ఈనెల 28నుంచి పారిస్ వేదికగా జరిగే పారా ఒలింపిక్స్‌లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అర్షద్ షేక్, కె. నారాయణ ప్రాతినిధ్యం వహించనున్నారు. అథ్లెటిక్స్ విభాగంలోని సైక్లింగ్‌లో అర్షద్ షేక్ బరిలోక దిగుతుండగా.. రోయింగ్‌లో కె. నారాయణ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఆసియా రోడ్ పారా సైక్లింగ్ ఛాంపియన్‌షిప్ ఎలైట్ వ్యక్తిగత ట్రయల్ సి-2లో రజత పతకం సాధించి అర్షద్ పారా ఒలింపిక్స్‌కు అర్హత సాధించాడు. అంతకుముందు ఆసియా ట్రాక్ సైక్లింగ్ ఛాంపియన్‌షిప్ సి-2 కేటగిరీ 15కి.మీ. స్క్రాట్ ఫైనల్లో స్వర్ణం కూడా సాధించాడు. అర్షద్ జమ్ము కాశ్మీర్‌లో మందుపార పేలుడు కారణంగా భారత ఆర్మీలో ఉన్న నారాయణ తన ఎడమకాలు మోకాలి క్రింది భాగాన్ని కోల్పోయాడు. ఇక నారాయణ 2022 హాంగ్జౌ వేదికగా జరిగిన పారా సియా క్రీడల్లో పిఆర్-3 మిక్స్‌డ్ డబుల్స్ స్కల్స్‌లో రజత పతకం సాధించి పారిస్ ఒలింపిక్స్‌కు క్వాలిఫై అయ్యాడు. పారాలింపిక్స్ పారిస్ వేదికగా ఆగస్టు 28నుంచి సెప్టెంబర్ 8వరకు జరగనున్నాయి.