ఎస్సీల సంక్షేమానికి అధిక నిధులు మంజూరు చేసినందుకు సీఎం రేవంత్ కు కృతజ్ఞతలు: అర్షం అశోక్

Thanks to CM Revanth for sanctioning huge funds for the welfare of SCs: Arsham Ashokనవతెలంగాణ – ఆత్మకూరు 
ఎస్సీల సంక్షేమానికి బడ్జెట్లో అధిక నిధులు కేటాయించినందుకు సీఎం రేవంత్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు రాష్ట్ర ఎస్సీ సెల్ కన్వీనర్ అర్షం అశోక్ తెలిపారు. మండలంలోని నీరు కుళ్ళు గ్రామంలో శుక్రవారం ఎస్సీ సంఘాల అద్వర్యంలో సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అర్షం అశోక్ హాజరై అంబెడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం అశోక్ మాట్లాడుతూ స్వరాష్ట్రం స్వపరిపాలన, నీళ్లు నిధులు నియామకాల కొరకు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో పదేళ్లలో ఎస్సీ లకు గత ప్రభుత్వం నిర్వీర్యం చెసింది. కాంగ్రెస్ ప్రభుత్వంలోని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర ఎస్సీ సామాజిక వర్గానికి తొలిసారిగా బడ్జెట్లో అధిక నిధులు కెటాయించింది. రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో ఎస్సీ ల సంక్షేమానికి ప్రాధాన్యం ఇచ్చింది. ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి ప్రత్యేక నిధులు 2024-2025 సంవత్సరానికి మొత్తం రూ.51,982 కోట్లు కేటాయింపులు జరిగాయి.ఈ ఆర్థిక సంవత్సరంలో ఎస్సీ సంక్షేమానికి ప్రత్యేక నిధులు మంజూరు చేసినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రి వర్గానికి అలాగే ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ నగరి ప్రీతమ్ కు ఎస్సీ సంఘాల తరుపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ వర్కింగ్ ప్రెసిడెంట్ నీలం రాజు,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పి,సత్యనారాయణ మాజీ వార్డు మెంబర్ అర్షం రాజ్ కుమార్,అర్షం కుమార్ అన్నదాత, కీత రాజు,చిమ్మని రమేష్ దుర్శిశేట్టి శ్రావణ్, దుర్శిశేట్టి రాంబాబు, ఎన్నపురెడ్డి నాగరాజు,మేడ మల్లిఖార్జున్, అర్షం కిరణ్, అర్షం పరమయ్య కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.