కౌంటీల్లో ఆర్ష్‌దీప్‌ అరంగేట్రం

లండన్‌: టీమిండియా ఎడమచేతి వాటం పేసర్‌ ఆర్ష్‌దీప్‌ సింగ్‌ కౌంటీల్లో అరంగేట్రం చేశాడు. కెంట్‌ తరఫున అరంగేట్రం చేసిన ఆర్ష్‌దీప్‌ సర్రే జట్టుపై తొలి వికెట్‌ను తీశాడు. బెన్‌ ఫోక్స్‌ను ఔట్‌ చేసి కౌంటీల్లో తొలి వికెట్‌ను సాధించాడు. ఆర్ష్‌దీప్‌ వేసిన గుడ్‌లెంగ్త్‌ బంతికి ఫోక్స్‌ బౌల్డ్‌ అయ్యాడు. తొలిరోజు ఆటలో భాగంగా 14.2ఓవర్లు బౌల్‌ చేసిన 14.2ఓవర్లు వేసి 43 పరుగులిచ్చి 2వికెట్లను సాధించాడు. ఇందులో నాలుగు మెయిడెన్లు కూడా ఉన్నాయి. పంజాబ్‌కు చెందిన 24ఏళ్ల ఆర్ష్‌దీప్‌ ఎడమచేతి ఇన్‌స్వింగ్‌ బౌలర్‌. గత ఏడాది ఇంగ్లండ్‌లో టి20ల్లో అరంగేట్రం చేయడానికి ముందు 2019ఐపిఎల్‌లో అద్భుత ప్రదర్శన చేసి ప్రపంచ దృష్టిని ఆకర్షించిన సంగతి తెలిసిందే. అంతర్జాతీయ క్రికెట్‌ కెరీర్‌లో ఇప్పటివరకు మూడు వన్డేలు, 26టి20ల్లో 17.78సగటుతో 41వికెట్లు తీసాడు. టి20ల్లో అత్యుత్తమ ప్రదర్శన 4/37గా ఉంది. ఏడు ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌ మ్యాచుల్లో 23.84సగటుతో 25వికెట్లు తీసాడు. అందులో 5/33 అత్యుత్తమ బౌలింగ్‌ గణాంకాలు.