పట్టభద్రుల ఓటు వినియోగం.. ఎండ తీవ్రతపై కళాప్రదర్శన

– ఆటపాటలతో అవగాహన కల్పించిన సాంస్కృతిక సారధి కళాకారులు
నవతెలంగాణ – తాడ్వాయి 
పట్ట బద్రుల ఓటు వినియోగం, ఎండ తీవ్రత పై జిల్లా కలెక్టర్, డిపిఆర్ఓ, ఆధ్వర్యంలో సాంస్కృతిక సారధి రామంచ సురేష్, బృందంచే శుక్రవారం మండలంలోని కొడిశల, లింగాల గ్రామాల్లో ఓటు సద్వినియోగం ఎండ తీవ్రత, వడదెబ్బపై ఆటపాటలతో ప్రజలకు అర్థమయ్యే రీతిలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు దరఖాస్తు చేసుకున్న పట్టభద్రులందరూ ఓటు హక్కును వినియోగించుకొని, ఓటింగ్ శాతాన్ని పెంచి ప్రజాస్వామ్యాన్ని గౌరవించుకోవలసిన బాధ్యత ఉంది అని తెలియజేశారు. ప్రభుత్వ అధికారుల సూచనలు పాటిస్తూ ఎండ నుంచి రక్షణ పొందాలని, ప్రజలందరూ సల్లపూటనే పనులు చేసుకుని ఎండ దెబ్బ తాకకుండా జాగ్రత్త పడాలని ఆటపాటలతో అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, కళాకారులు రామంచ సురేష్, రాగుల శంకర్, గోల్కొండ బుచ్చన్న, ఈర్ల సాగర్, మార్త రవి, కనకం రాజేందర్,బోడ కిషన్,ఉప్పుల విజయ్ కుమార్, పొలిపాక తిరుపతి, రెంటాల కుమార్, గోల్కొండ నరేష్, ఉండ్రాతి భాస్కర్, కామెరదీపక్, మొగిలిచర్ల రాము, శ్రీలత, శోభ తదితరులు పాల్గొన్నారు.