పోలింగ్ శాతం పెంచేందుకు కళా ప్రదర్శనలు..

– ఎం.సి.సి నోడల్ అధికారి పర్యవేక్షణలో నిర్వహణ..
నవతెలంగాణ- అశ్వారావుపేట: ఈ నెల 30 జరగనున్న సాధారణ ఎన్నికల్లో పోలింగ్ శాతం పెంచేందుకు ఎన్నికల సంఘం ఆద్వర్యంలో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రియాంక అల ఆదేశానుసారం కళా ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. ఈ నేపధ్యంలో అశ్వారావుపేట మండలంలో మంగళవారం ఎం.సి.సి నోడల్ అధికారి, ఎం.డి.ఒ శ్రీనివాసరావు పర్యవేక్షణలో కళాబృందం నాయకుడు పాగి వెంకన్న నేతృత్వంలో అవగాహన కల్పిస్తున్నారు.
గత ఎన్నికల్లో 70 శాతం కంటే తక్కువగా ఓటింగ్ నమోదు అయిన మండలంలోని నందిపాడు, వడ్డిరంగాపురం, దురద పాడు,వినాయకపురం లోని పాత ఊరు, వడ్డెర కానీ ల్లో ఓటర్లకు ఓటు ప్రాధాన్యత, ఓటు ఎలా వేయాలి అనే విషయాలు పై అవగాహన కల్పిస్తున్నట్లు శ్రీనివాసరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో సెర్ప్  ఎ.పి.ఎం వెంకటేశ్వరరెడ్డి,సి.సి లు పాల్గొన్నారు.