ఈ రోజు భువనగిరి పట్టణం లోని స్థానిక ఎస్ ఈ ఆఫీస్ లో తెలంగాణ విద్యుత్ సంస్థలు లో పనిచేస్తున్న సుమారు 20 వేల ఆర్టిజన్స్ ఉద్యోగుల సమస్యల పరిష్కారం విద్యా అర్హతను బట్టి కన్వర్షన్ చేయాలని టీబీఏ జెసి జేఏసీ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు తలపెట్టిన రిలే నిరాహార దీక్షల సంఘీభావముగా యాదాద్రి జిల్లా ఎస్ఈ ఆఫీస్ ముందు ఆర్టిజన్ కార్మికులు రిలే నిరాహార దీక్షలు చేశారు. దీక్షలు భాగంగా జిల్లా చైర్మన్ బక్కనగారి బాలరాజ్ కన్వీనర్ హైమత్, కో చైర్మన్ చిలువేరు విజయ్ కుమార్, కో కన్వీనర్ అప్పిడి రాజిరెడ్డి, సభ్యులు భాస్కర్ రెడ్డి, సురేష్, శ్రీను, సైదులు, నరేష్, నరసింహస్వామి, తనీష్ ఆర్టిజన్ కార్మికులు పాల్గొన్నారు.