స్వచ్ఛభారత్, ఓటుహక్కుపై కళాజాత

నవతెలంగాణ – మల్హర్ రావు
భూపాలపల్లి జిల్లా కలెక్టర్,డిపిఆర్ఓ ఆదేశాల మేరకు మండలంలోని నాచారం,తాడ్వాయి గ్రామాల్లో తెలంగాణ సాంస్కృతిక సారధి సిగ్గం శిరీష కళాబృందం సోమవారం ఓటు హక్కు, పరిసరాల పరిశుభ్రత పై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా ఎలాంటి ప్రలోభాలకు తలొగ్గకుండా త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో గ్రాడ్యుయేట్ ఓటుహక్కును వినియోగించుకోవాలని,మన ఇంటిచుట్టు, పరిసరాల్లో పరిశుభ్రంగా ఉంచులుంటే అంటువ్యాధులు దరి చేరవని పాటలతో అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో కళాకారులు సెగ్గం శిరీష,జాడి సుమలత, గడ్డం నాగమణి, కాసా స్వాతి, పులి రాధి, కమ్మల ప్రవీణ్ కుమార్, ఆత్మకూరి మహేందర్, సోదారి సురేందర్, చీకట్ల శంకర్, చిలుముల మధుబాబు, ప్రజలు పాల్గొన్నారు.