కళలను ప్రోత్సహించాలి

ప్రియమైన వేణు గీతికకు నా బంగారు తల్లి ఎలా ఉన్నావు? ‘కంపెనీ ఫౌండేషన్‌ డే వస్తోంది అమ్మా, డాన్స్‌ ప్రాక్టీస్‌ చేస్తున్నా’ అన్నావు. నువ్వు నేర్చుకున్న కళని మర్చిపోకుండా  వీలున్నప్పుడల్లా ప్రదర్శిస్తున్నందుకు చాలా సంతోషం. మన భారతీయ కళలు చాలా గొప్పవి నాన్న. 64 కళలు ఉన్నాయి. ఒక్కో కళా గొప్పతనం చెప్పాలంటే పదాలు చాలవు.  దువు ఒక్కటే కాకుండా పిల్లల అభిరుచులను గుర్తించి వారిని ప్రోత్సహించాలి. అందుకే నీకు ఇష్టమని మీ నాన్న నీకు డ్యాన్స్‌ నేర్పించారు. తల్లిదండ్రులు తమ  ల్లలను  దువు విషయంలో ఒత్తిడి చేయకుండా కళల పట్ల కూడా వారిని ప్రోత్సహించాలి. నువ్వు నాలుగేండ్ల వయసులో కూచిపూడి నేర్చుకోవడం మొదలు పెట్టావు. దానితో  టు జానపద నృత్యం కూడా నేర్చుకున్నావు. స్కూల్లో జరిగి ప్రతి సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనే దానివి. వీటితో పాటు కొంచం టైం దొరికినా డ్రాయింగ్‌ వేసేదానివి.  దైనా  సి వేయటం కూడా ఒక కళే. ఎక్కువగా నిబ్‌ పెన్‌ ఆర్ట్‌, పెన్సిల్‌ ఆర్ట్‌ వేసేదానివి. ఇలా మంచి వ్యాపకాలు ఉండటం, కొత్తగా చేయా లనే తపన ఉండటం పిల్లల  దుగుదలకు చాలామంచిది. కొందరికి చదువు కంటే కళల పట్ల అభిరుచి ఉంటుంది. పూర్వకాలంలో చదువు ఉంటేనే ఉద్యోగం వచ్చేది. కానీ ఇప్పుడు అలా కాదు అన్ని  గాలలోనూ రాణించవచ్చు. కాకపోతే కళలు ఖర్చుతో కూడుకున్నవి. మానసిక ప్రశాంతతకు, శారీరక వ్యాయామానికి నాట్యం దివ్య ఔషధం. నాట్యం వల్ల అనేక రోగాలు  యం అవుతాయి. సంగీతం వల్ల మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు. చాలామందికి కళల పట్ల, కళాకారుల పట్ల చిన్న చూపు. ఇంకా చెప్పాలంటే చులకన భావం. ఈ  లోచన నుండి బైటపడాలి. ఎందరో గొప్ప గొప్ప కళాకారులు ఉన్న దేశం మనది. మన దేశ కీర్తి ప్రతిష్టలు తమ కళల ద్వారా ప్రపంచ వ్యాప్తం వేశారు వారు. కనుక తల్లి దండ్రులు వారి పిల్లల అభిరుచులను గుర్తించి ప్రోత్సహించి. వారిని మంచి కళాకారులుగా తీర్చిదిద్దితే అంత కన్నా గర్వించ దగ్గ విషయం మరోటిలేదు. నువ్వు కూడా నీకు వచ్చిన కళను ఇతరులకు నేర్పిస్తూ, డాన్సులు కంపోజ్‌ చేస్తున్నందుకు నిన్ను అభినందిస్తూ…
ప్రేమతో అమ్మ
హొ- పాలపర్తి సంధ్యారాణి