
స్థానిక ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఇటీవల హిందువుల పట్ల చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని ఉత్తర రాష్ట్ర తెలంగాణ పార్టీ మహిళ అధ్యక్షురాలు కూరపాటి అరుణ జ్యోతి అన్నారు. గురువారం పట్టణంలోని ప్రెస్ క్లబ్ లో వారు మీడియా సమావేశం నిర్వహించారు. హిందువుల మనోభావాలు దెబ్బ తినేలా ఎమ్మెల్యే మాట్లాడడం సరైనది కాదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఆయన క్షమాపణ చెప్పాలని.. ఎమ్మెల్యే తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఉత్తర రాష్ట్ర తెలంగాణ పార్టీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.