బ్యాక్ లాక్ పరీక్షలు పర్యవేక్షించిన  పరీక్షల నియంత్రణ అధికారిని అరుణ..

నవతెలంగాణ- డిచ్ పల్లి
తెలంగాణ యూనివర్సిటీ  పరిధిలోని యూజీ,  పీజీ పరీక్షలను బుధవారం తెలంగాణ యూనివర్సిటీ పరీక్షల నియంత్రణ అధికారిని ప్రొఫెసర్ డాక్టర్ ఎం.అరుణ, కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ డాక్టర్  సిహెచ్ ఆరతి,  అడిషనల్ కంట్రోలర్ బి.సాయిలు యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ సెంటర్లో  పర్యవేక్షించారు. ఈ సందర్భంగా కంట్రోలర్ మాట్లాడుతూ యూజీ ఐదవ  సెమిస్టర్ రెగ్యులర్, ఆరవ సెమిస్టర్ బ్యాక్ లాగ్ పరీక్షలకు మొత్తం విద్యార్థులు 9797 మంది పరీక్ష ఫీజు చెల్లించినప్పటికీ ఇందులో పరీక్షకు హాజరైన వారి సంఖ్య 9164 మందివిద్యార్థులు మాత్రమే.633 మంది విద్యార్థులు గైరాజరు  అయ్యారని తెలిపారు.యూజీ మధ్యాహ్నం జరిగిన ఒకటవ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షలకు మొత్తం విద్యార్థులు 8356 మంది విద్యార్థులు ఫీజు చెల్లించినప్పటికీ  ఇందులో పరీక్షకు హాజరైన వారి సంఖ్య 7578 మందివిద్యార్థులు కాగా ఇందులో నలుగురు విద్యార్థుల ఫై మాల్ ప్రాక్టీస్ కేసు నమోదైంది. 778 మంది విద్యార్థులు గైర్హాజరు అయ్యారని తెలిపారు. ఎంబీఏ,ఎంసీఏ మూడవ సెమిస్టర్, రెగ్యులర్ మరియు ఐ ఎం బి ఏ తొమ్మిద సెమిస్టర్ పరీక్షలకు మొత్తం విద్యార్థులు 538 మంది ఫీజు చెల్లించినప్పటికీ ఇందులో పరీక్షకు హాజరైన వారి సంఖ్య 507 మందివిద్యార్థులు మాత్రమేనన్నారు. 31 మంది విద్యార్థులు గైరాజరయ్యారని పరీక్షల  నియంత్రణ అధికారిని తెలిపారు.