అరుణోదయ 50 వసంతాల ప్రస్థానానికి జేజేలు…

Arunodaya celebrates 50 years of Vasantha...న‌వ‌తెలంగాణ – హైద‌రాబాద్‌
ఈ నెల‌ 14,15 తేదీలలో హైదరాబాదులో జరిగే అరుణోదయ సభల సందర్భంగా ముద్రించిన ఆహ్వాన సంఘం కరపత్రమును బాగ్ లింగంపల్లి అంబేద్కర్ డిగ్రీ కాలేజీలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అరుణోదయ సంస్కృతిక సమాఖ్య జంట నగరాల ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ రావణ్ రాకేష్ మాట్లాడుతూ భారత విప్లవోద్యమంలో అరుణోదయ పాత్ర కీలకమైనవి అని అన్నారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో భాగంగా టీయూఎఫ్‌ నిర్వహించిన అనేక ఉద్యమాల్లో పాల్గొని నిర్బంధాన్ని సైతం ఎదుర్కొన్నది అన్నారు. ప్రత్యేక రాష్ట్రం కోసం గలమెత్తిన విమలక్కను అప్పటి ప్రభుత్వం దాదాపు మూడు నెలలు జైల్లో నిర్బంధించింద‌న్నా‌రు. ఈ కార్యక్రమంలో కాలేజీ విద్యార్థులు కామ్రేడ్ సురేష్, అక్షయ, మానస, భవాని, శివాని రెడ్డి, ప్రీతి, శరత్ తదితరులు పాల్గొన్నారు.