అరూరి రమేష్ ను భారీ మెజారిటీతో గెలిపించాలి

నవతెలంగాణ – ఐనవోలు: రాబోయే సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఐనవోలు మండలంలోని నందనం గ్రామంలో ఆరూరి రమేష్ గెలుపు కోసం గ్రామపార్టీ అద్యక్షులు జున్న లవన్ ఆధ్వర్యంలో నిర్వహించిన బూత్ కమిటీ సభ్యులు, పార్టీ కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిధిగా జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గజ్జెల్లి శ్రీరాములు హాజరై గ్రామాల్లో పార్టీ శ్రేణులు సమన్వయంతో పని చేసి అరూరి రమేష్ని భారీ మేజారిటీతో గెలిపించాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో ఐనవోలు మండల ఎన్నికల ఇంచార్జ్ గోకె కరుణాకర్, ఐనవోలు మండల పార్టీ అధ్యక్షుడు పోలేపల్లి శంకర్ రెడ్డి, మండల పార్టీ ప్రదానకార్యదర్శి బుర్ర రాజశేఖర్ గౌడ్, గ్రామ పార్టీ ఇంచార్జి అడ్డగూడి సతీష్,గ్రామ సర్పంచ్ యాకర మంజుల యాదగిరి,మండల యూత్ అద్యక్షుడు ఎం.నరేష్, బూత్ కన్వీనర్ లు పిట్టల సుధాకర్, మరుపట్ల దేవదాసు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.