ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి 

నవతెలంగాణ – సిద్దిపేట
ఆర్యవైశ్యుల సమస్యలను దృష్టిలో పెట్టుకుని త్వరలో ఆర్యవైశ్య కార్పొరేషన్ యేర్పాటు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వన్ని రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ కార్యదర్శి గంప శ్రీనివాస్ , ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అయిత రత్నకర్, జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు కాసం నవీన్ కుమార్   డిమాండ్ చేశారు. శనివారం వారు మాట్లాడుతూ తెలంగాణ లో జరిగిన 2018  సాధారణ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ గెలిస్తే ఆర్యవైశ్య కార్పొరేషన్ యేర్పాటు చేస్తామని  మ్యానిఫెస్టో లో పెట్టడం జరిగిందని,  ప్రకటించిన విధంగా త్వరలో  ఆర్యవైశ్య కార్పొరేషన్ ఎర్పాటు చేసి,  ఒక వెయ్యి  కోట్ల రూపాయలను కేటాయించలని కోరారు. కార్పొరేట్ వ్యవస్థ వచ్చిన తర్వాత పెద్ద పెద్ద మాల్స్ వచ్చి చిన్న వ్యాపారులు చాలా నష్టపోయారని,  వ్యాపారాలు నడవక చాలా మంది వైశ్యులు అప్పుల పాలై ఒకనాడు షాప్ కు యజమనిగా ఉన్నవారు ఎంతో మంది గుమస్తాలుగా పని చేస్తున్నరాని ఆవేదన వ్యక్తంచేశారు.  ఆర్యవైశ్యులు చాలామంది వ్యాపారం మీదనే ఆధారపడి వుంటరని,   వైశ్య కార్పొరేషన్ యేర్పాటు చేసి ప్రత్యేక బడ్జెట్ కేటాయించలని, సబ్సిడీతో పాటు వడ్డీలేని రుణాలు పొంది చిన్న వ్యాపారులు వారి యొక్క వ్యాపారం చేస్తు కొంతవరకు సమాజంలో గౌరవంగ  బ్రతుకుతారని అన్నారు.  సీఎం కెసిఆర్ స్పందించి త్వరలో ఆర్యవైశ్య కార్పొరేషన్ యేర్పాటు చేయాలని,   మంత్రి హరీశ్ రావు  కూడా ప్రత్యేక చొరవ తీసుకోని కార్పొరేషన్ యేర్పాటు కు ప్రభుత్వన్ని ఒప్పించలని కోరారు.  వైశ్య కార్పొరేషన్ యేర్పాటు చేయలని,  లేని యెడల పెద్ద యెత్తున రాష్ట్ర స్థాయిలో ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో వైశ్యులతో ఉద్యమం చేపట్టి  తమ హక్కులను సాధించు కుంటమనీ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆర్యవైశ్య మహాసభ ప్రధాన కార్యదర్శి తడక లింగమూర్తి, వర్కింగ్ ప్రెసిడెంట్ ఉప్పల పాండురంగం, జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు హేమలత, కోశాధికారి మరియాల వాణి, జిల్లా యువజన విభాగం ప్రధాన కార్యదర్శి పుల్లూరి శివకుమార్, జిల్లా వాసవి సేవాదల్ కోశాధికారి చింత రాజేంద్ర ప్రసాద్, వర్కింగ్ ప్రెసిడెంట్ మంకల నవీన్ కుమార్, సిద్దిపేట డివిజన్ చైర్మన్ గంప కృష్ణమూర్తి, కార్యదర్శి గంగిశెట్టి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.