నవతెలంగాణ – అశ్వారావుపేట
ఆర్యవైశ్య మహా సభ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కోశాధికారి గా అశ్వారావుపేట కు చెందిన శీమకుర్తి తాతా శ్రీనివాసరావు నియమించబడ్డారు. ఈ మేరకు శనివారం జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు ధారా రమేష్ నియామకపు పత్రాన్ని అందజేశారు శ్రీనివాసరావు కు అందజేసారు.కార్యక్రమంలో రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ కార్యవర్గ సభ్యులు పెండ్యాల విజయభాస్కర్,జిల్లా ప్రధాన కార్యదర్శి ఎలుగూరి నగేష్, జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి పల్లెల చంద్రశేఖర్, అశ్వారావుపేట మండల అధ్యక్షుడు శీమకుర్తి శ్రీనివాసరావు,పట్టణ అధ్యక్షులు లోక్నాథ్ గుప్తా , కొత్తగూడెం పట్టణ అధ్యక్షులు ధారా నగేష్, డి ఎస్ ఎస్ వి ఎం కే బాబు( దారా శ్రీనివాస్), నరేంద్రుల అను బాబు తదితరులు పాల్గొన్నారు. పట్టణానికి పలువురు ప్రముఖులు,ప్రజాప్రతినిధులు,రాజకీయ నాయకులు తాతా శ్రీనివాస రావుకు అభినందనలు తెలిపారు.