ఆర్యవైశ్యలు అన్ని రంగాల్లో ముందు ఉండాలి

నిజామాబాద్ అర్బన్ ఎమ్మేల్యే ధన్ పాల్ సూర్యనారాయణ
నవతెలంగాణ –  కంటేశ్వర్
ఆర్యవైశ్యులు అన్ని రంగాల్లో ముందుండాలి అని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. ఈ మేరకు శుక్రవారం రాత్రి నిజామాబాదు నగరం లోని శ్రీరామ గార్డెన్స్ లో ఆర్యవైశ్య పట్టణ శాఖ ఆధ్వర్యంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ కి సన్మాన కార్యక్రమం, అభినందన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మొదట వాసవి మాత పూజ కార్యక్రమం నిర్వహించి కార్యక్రమన్ని ప్రారంభించారు.ఈ సందర్బంగా కంటేశ్వర్ ఆలయం నుంచి శ్రీరామ గార్డెన్స్ వరకు ఆర్యవైశ్య సోదరులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించి పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ మాట్లాడుతు.. ఆర్యవైష్య సోదరులు అన్ని రంగాల్లో ముందు ఉండాలని కోరారు. వాసవి మాత ఆశీర్వాదం తో మనమందరం కలసి కట్టుగా ఉండి ముందుకు సాగుదాం అన్నారు. పేద ఆర్యవైశ్య కుటుంబ సభ్యులని వెలికి తీసి, వారికీ అండగా ఉండాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పై ఉంది అన్నారు. రాజకీయంలో ఆర్యవైష్యులకు సమూచిత స్థానం కల్పిస్తానని తెలిపారు. పేద ఆర్యవైశ్యలకోసం ఎన్నో సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నామని అన్నారు. తన  చిరకాల వాంఛ కార్పొరేషన్ ఏర్పాటుకు ముఖ్యమంత్రి  దృష్టికి తీసుకెళ్తా అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఈడబ్ల్యూఎస్ ఒక వరం అన్నారు. పట్టణం లోని ఆర్యవైశ్య సంఘాలకి ఇప్పటి వరకు మా ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది అన్నారు. ఆర్యవైశ్య సోదరులు ఏర్పాటు చేసుకున్న సంఘాల కు నిధులు మంజూరు చేస్తాను అన్నారు. నగరంలో ఇప్పటికైనా రాజకీయాలు పక్కన పెట్టి మన సంఘ అభివృధికి సహకరించాలని కోరుతున్నాను అన్నారు. నా గెలుపు లో మీ పాత్ర మరువలేనిది అన్నారు. ప్రతి ఒక్కరు కష్టపడి నా గెలుపుకు సహకరించారని అన్నారు. ఈ సందర్బంగా పట్టణ సంఘం అధ్యక్షులు కొండా వీరశేఖర్, ప్రధాన కార్యదర్శి దేవత చంద్రశేఖర్, కోశాధికారి కాపర్తి వెంకటేష్,ఇల్లేందుల మమత ప్రభాకర్, సభ్యులు లభిషేట్టి శ్రీనివాస్, మామిడి రాజేందర్, సంతోష్, మహాకలి విజయ్, ప్రతాప్, పోచయ్య, విశ్వనాధం, మురళీదార్, రాజేందర్,పెద్ద ఎత్తున ఆర్యవైష్యులు సోదరా సోదరీమణులు పాల్గొన్నారు.