టైటిల్‌ పోరుకు ఆర్య వారియర్స్‌, టీఆఫ్స్‌

టైటిల్‌ పోరుకు– తెలంగాణ ప్రీమియర్‌ గోల్ఫ్‌ లీగ్‌
హైదరాబాద్‌ : తెలంగాణ ప్రీమియర్‌ గోల్ఫ్‌ లీగ్‌ (టీపీజీఎల్‌) టైటిల్‌ పోరుకు కె మోటార్స్‌ ఆర్య వారియర్స్‌, టీమ్‌ టీఆఫ్స్‌ చేరుకున్నాయి. గోల్కోండలోని గోల్ఫ్‌ క్లబ్‌లో గురువారం జరిగిన సెమీఫైనల్లో ఎంవైకె స్ట్రయికర్స్‌పై 3.5-2.5తో కె మోటార్స్‌ ఆర్య వారియర్స్‌ గెలుపొందింది. మరో సెమీఫైనల్లో లహరి లయన్స్‌ను 4-2తో టీమ్‌ టీఆఫ్స్‌ మట్టికరిపించింది. శని, ఆదివారాల్లో జరిగే ఫైనల్లో టైటిల్‌ కోసం ఆర్య వారియర్స్‌, టీమ్‌ టీఆఫ్స్‌ తాడోపేడో తేల్చుకోనున్నాయి.