నవతెలంగాణ – తిరుమలగిరి
సామాన్యుల్లో సామాన్యుడిగా కలిసిపోవడం, రాజకీయ నాయకుడు అయిన నిత్య కృషివలుగా వ్యవసాయం చేయడంలో ఆయనకు ఆయనే సాటి. ఇప్పుడు వర్షాలు పడుతున్న క్రమంలో ఖరీఫ్ సీజన్ కావడంతో ఏరువాక సాగారో అంటూ కూలీలతో కలిసి రైతుల వ్యవసాయం చేస్తున్న జిల్లా కాంగ్రెస్ నాయకులు మాజీ ఎంపీపీ సుంకరి జనార్ధన్ రైతాంగానికి మార్గదర్శిగా మారారు.ఈ మధ్యకాలంలో ఎప్పుడు రాజకీయాల్లో బిజీగా ఉంటూ ప్రజలకు సేవ చేయాలనే తలంపుతో కాంగ్రెస్ పార్టీలో చేరి తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామెల్ గెలుపు కోసం అహర్నిశలు కష్టపడి విజయం సాధించడంలో ముఖ్యపాత్ర వహించిన తిరుమలగిరి మాజీ వైస్ ఎంపీపీ జిల్లా కాంగ్రెస్ నాయకులు సుంకరి జనార్ధన్. ఆనాటి నుండి నేటి వరకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటూ ఎమ్మెల్యే అడుగుజాడల్లో పయనిస్తూ ముఖ్య అనుచరునిగా పేరొందిన సుంకర జనార్ధన్ మంగళవారం రాయపర్తి మండలంలోని ఓ గ్రామంలో ఉన్న తన వ్యవసాయ క్షేత్రంలో నారువేస్తూ కనిపించారు. రాయపర్తి మండలంలోని మైలారం గ్రామ సమీపంలో ఉన్న వ్యవసాయ కేంద్రంలో కూలీలతో మమేకమై వారికి వరి నారును చేరవేస్తూ వ్యవసాయ పనిలో నిమగ్నుడై కనిపించారు. ఎంత ఉన్నా, ఎంత ఎత్తు ఎదిగిన తన పనే ముఖ్యమని వ్యవసాయ పనుల్లో నిమగ్నడు కావడంతో చర్చనీయాంశంగా మారింది.