హీరో విశ్వక్ సేన్ తన 13వ ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేశారు. దసరాతో భారీ బ్లాక్‌బస్టర్ అందించిన ఎస్‌ఎల్‌వి సినిమాస్‌పై నిర్మాత సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ బ్యానర్ నుంచి ప్రొడక్షన్ నెం. 8గా వస్తున్న ఈ చిత్రం గ్రాండ్ ప్రొడక్షన్ వాల్యూస్‌తో హై బడ్జెట్‌తో రూపొందనుంది. నూతన దర్శకుడు శ్రీధర్ గంటా రచన, దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే యూనిక్ పొలిటికల్ యాక్షన్ డ్రామాగా ప్రేక్షకుల్ని అలరించనుంది. విశ్వక్ పవర్‌ఫుల్ ఐపీఎస్ ఆఫీసర్‌గా ప్రీ-లుక్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఫైర్ బ్యాక్ డ్రాప్‌లో ప్రజెంట్ చేసిన ఈ పోస్టర్ సినిమాపై క్యూరియాసిటీని క్రియేట్ చేసింది. ఎవ్రీ యాక్షన్ ఫైర్స్ ఏ రియాక్షన్ అనేది ఈ సినిమా ట్యాగ్‌లైన్. ఈ చిత్రానికి రచన, దర్శకత్వం: శ్రీధర్ గంటా, డీవోపీ: కిషోర్ కుమార్, సంగీతం: అజనీష్ లోక్‌నాథ్.