కెప్టెన్‌ మార్వెల్‌గా..

As Captain Marvel..ది మార్వెల్స్‌ కోసం తాజా ఫీచర్‌లో బ్రీ లార్సన్‌ మొదటిసారి కెప్టెన్‌ మార్వెల్‌ సూట్‌ ధరించడం విశేషం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు ది మార్వెల్స్‌లో ఆమె తిరిగి రావడం కోసం ఎదురు చూస్తున్న చూస్తున్న తరుణం రానే వచ్చేసింది.
క్రీ రెనెగేడ్‌ నుండి మాడ్‌ టైటాన్‌: థానోస్‌తో పోరాడటానికి ఎవెంజర్స్‌లో చేరడం వరకు బ్రీ లార్సన్‌ తన ప్రయాణాన్ని ఎలా సాగించిందో ఇందులో చూడొచ్చు. బ్రీ లార్సన్‌ మాట్లాడుతూ, ‘కెప్టెన్‌ మార్వెల్‌ సూట్‌లో కనిపించడం నా జీవితంలో అత్యంత అధివాస్తవిక అనుభవం. అత్యంత డైనమిక్‌ క్యారెక్టర్‌ ఇది’ అని తెలిపారు. ‘కెప్టెన్‌ మార్వెల్‌గా లార్సన్‌ నటన అద్బుతం. ఈ దీపావళికి భారతదేశం అంతటా రిలీజ్‌కి రెడీగా ఉంది. నవంబర్‌ 10న ఇంగ్లీష్‌, హిందీ, తమిళం, తెలుగు భాషలలో దీన్ని థియేటర్లలో చూడొచ్చు’ అని నిర్మాత కెవిన్‌ ఫిగే చెప్పారు.