ఎన్టీఆర్ టైటిల్ పాత్రలో నటిస్తున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రం ‘దేవర’. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ పతాకాలపై మిక్కిలినేని సుధాకర్, హరి కష్ణ.కె నిర్మిస్తున్నారు. ఎన్టీఆర్‌కి జోడీగా బాలీవుడ్ నాయిక జాన్వీకపూర్ నటిస్తుండగా, మరో బాలీవుడ్ నటుడు సైఫ్ ఆలీఖాన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. హై యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ‘దేవర’ను రెండు భాగాలుగా రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో ‘దేవర: పార్ట్ 1’ను తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో సెప్టెంబర్ 27న రిలీజ్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో రిలీజ్ డేట్ ఇక కేవలం 30 రోజులు మాత్రమే ఉందని గుర్తు చేస్తూ మేకర్స్ రిలీజ్ చేసిన ఫియర్ ఆఫ్ ఫేసెస్ పోస్టర్‌లో రెండు భిన్నలుక్స్‌తో ఎన్టీఆర్ సర్‌ప్రైజ్ చేశారు. అంతే కాదు ఈ సినిమాలో తండ్రీ కొడుకులుగా ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేస్తున్నారా? అనే సందేహానికి కూడా తెర తీశారు. ఆ సందేహం కరెక్టో కాదో తెలియాలంటే సినిమా రిలీజ్ వరకు ఆగాల్సిందే.