– తప్పుదోవ పట్టించే ప్రకటనలు నమ్మొద్దు : డీసీఏ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఆయుర్వేదిక్ మెడిసిన్ పత్రికేర్ సిరప్‌తో మూత్రపిండాల్లో రాళ్లు కరుగుతాయంటూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రకటనలు ఇస్తున్నారని డ్రగ్ కంట్రోల్ అధికారులు అప్రమత్తం చేశారు. ఈ మేరకు డ్రగ్ కంట్రోల్ అథారిటీ డైరెక్టర్ జనరల్ వీ.బీ.కమలాసన్ రెడ్డి గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. గుజరాత్‌కు చెందిన భవానీ ఫార్మాస్యూటికల్స్ తయారు చేసి, అదే రాష్ట్రానికి చెందిన అల్లోయిస్ ఫార్మాస్యూటికల్స్ ప్రయివేట్ లిమిటెడ్ మార్కెటింగ్ చేస్తున్న ఈ సిరప్‌ను పెద్దపల్లిలో గుర్తించి అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తప్పుదోవ పట్టించే ప్రకటనలు ఇస్తూ అమ్మకాలు చేస్తే వారిపై డ్రగ్స్ అండ్ మ్యాజిక్ రెమెడీస్ (ఆబ్జెక్షనబుల్ అడ్వర్టైజ్ మెంట్స్) యాక్ట్, 1954 కింద చర్యలు తప్పవని డీసీఏ హెచ్చరించింది.