చట్టపకారం బాధిత కుటుంబానికి వెంటనే పరిహారం అందించాలి..

– జాతీయ ఎస్సి కమిషన్ చైర్మన్ అరుణ్ హల్డర్
నవతెలంగాణ – మీర్ పేట్
15 రోజుల క్రితం మలక్ పేట్ పోలీస్ స్టేషన్ ఆవరణంలో పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం ప్రయత్నించి, హాస్పిటల్ లో చికిత్స పొందు మరణించిన విజయ్ కుటుంబానికి ఎస్సి ఎస్టీ చట్టం ప్రకారం పరిహారం అందించాలని  జాతీయ ఎస్సి కమిషన్ చైర్మన్ అరుణ్ హల్డర్, జాతీయ ఎస్సి కమిషన్ రీజినల్ డైరెక్టర్ సునీల్ కుమార్ బాబు హైదరాబాద్ జిల్లా అడిషనల్ కలెక్టర్ మధుసూదన్ ను ఆదేశించారు. మీర్ పేట్ కార్పొరేషన్ పరిధిలోని మురళి కృష్ణ నగర్ లోనీ ఇంటి వద్ద బాధిత మృతుని కుటుంబాలను జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్ అరుణ్ హల్డర్, రీజినల్ డైరెక్టర్ సునీల్ కుమార్ బాబు పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్సి ఎస్టీ చట్టపకారం బాధిత కుటుంబానికి వెంటనే పరిహారం అందించాలని అడిషనల్ కలెక్టర్ ను ఆదేశించారు. మృతుడు విజయ్ భార్యకు ప్రభుత్వ ఉద్యోగం, పెన్షన్, నిత్యవసర సరుకులు, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, తక్షణ సాయం కింద అందాల్సిన నాలుగు లక్షల పదిహేను వేల ఐదు వందల రూపాయలు నగదును వెంటనే చెక్కును అందజేయాలని జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్ అడిషన్ కలెక్టర్ కు సూచించారు. అంతర్గతంగా విచారణ జరిపి పోలీస్ అధికారులు తప్పు ఉంటే చర్యలు తీసుకోవాలని, చట్ట ప్రకారం నిందితులను కఠినంగా శిక్షించాలని సౌత్ జోన్ డిసిపి రుపేష్ ఐపీస్ ను ఆదేశించారు. బాధిత కుటుంబాలకు అన్ని రకాలుగా జాతీయ ఎస్సి కమిషన్ అండగా ఉంటుందని బాధితులకు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కందుకూర్ ఆర్డీవో సూరజ్, బాలాపూర్ ఎమ్మార్వో మాధవి రెడ్డి, మీర్ పేట్ ఇన్స్పెక్టర్ కిరణ్ ఇతర శాఖల అధికారులు, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.