మాత్మ గాంధీ విగ్రహానికి ఆశా కార్యకర్తలు వినతిపత్రం

నవతెలంగాణ- తాడ్వాయి: ఆశా కార్యకర్తల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మండల కేంద్రంలో చేపట్టిన సమ్మె సోమవారం 8వ రోజు చేరింది. సమ్మెలో భాగంగా మాత్మ గాంధీ విగ్రహానికి తమ సమస్యలు పరిష్కరించాలని వినతిపత్రాన్ని అందజేశారు. ప్రభుత్వం తమతో సర్వేలు చేయించుకొని సమస్యలు పరిష్కరించకుండా శ్రమ దోపిడీకి గురి చేస్తుందని ఆరోపించారు. కనీస వేదం 18,000 25 లక్షల ప్రమాద బీమా పిఎస్ ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్ల యూనియన్ మండల అధ్యక్షురాలు జయసుధ, కవిత, రమాదేవి, రజిని, నాగమణి, పద్మ తదితరులు పాల్గొన్నారు.