– ఎమ్మెల్యే జీఎంఆర్‌కు వినతి
నవతెలంగాణ – గుమ్మడిదల
ఆశా వర్కర్లకు కనీస వేతనం రూ.18వేలు వెంటనే అమలు చేయాలని శనివారం గుమ్మడిదల మండల కేంద్రంలో పటాన్చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి ఆశా వర్కర్లు వినతిపత్రం అంద జేశారు. ఈ సందర్భంగా ఆశా వర్కర్ల సంఘం అధ్యక్షురాలు పోతరాజు అంజమ్మ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆశ వర్కర్ల పాత్ర కీలకమని ప్రజా ప్రతినిధులు గుర్తించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం దష్టికి తీసుకువెళ్లాలని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. కరోనా పాండమిక్ సిచువేషన్ లో ఆశా వర్కర్లుగా తమ కుటుంబాలను సైతం పక్కనపెట్టి ప్రజల శ్రేయస్సు ముఖ్యమని పనిచేసిన ఆశల సమస్యల పట్ల రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమని అన్నారు. ఈ కార్యక్రమంలో యాదమ్మ, పుణ్యమా, మరియ, మంజుల, సునీత, సరిత, మంజుల, మంగమ్మ, నవనీత, శిరీష, సుహాసిని, జ్యోతి, నస్రిన్ బేగం, నాగమణి, లావణ్య, రాణి, విజయలక్ష్మి పాల్గొన్నారు
నవతెలంగాణ-నారాయణఖేడ్ రూరల్
ఆశా వర్కర్లకు రూ.18 వేల ఫిక్స్‌డ్ వేతనం ఇవ్వాలని సీఐటీయూ మాజీ జిల్లా అధ్యక్షులు అతిమేల మాణిక్యం డిమాండ్ చేశారు. నారాయణఖేడ్ ఆర్డిఓ కార్యాలయం ముందు 13వ రోజులుగా సమ్మె ఆశాలు సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దుర్మార్గమన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆశా వర్కర్స్ కు ఫిక్స్డ్ వేతనం రూ.18 వేలివ్వాలన్నారు. ఈఎస్‌ఐ, పిఎఫ్, ప్రమాద బీమా, రిటర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలన్నారు. సమ్మె ప్రారంభించి 13 రోజులు అవుతున్నందున ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా నాయకులు ఎస్ చిరంజీవి, ఆశా వర్కర్ యూనియన్ నాయకులు పవిత్ర, లక్ష్మి , ఎలిషా, శారద విట్టా బారు, శ్యామల రేష్మ, సంతోషి తదితరులు పాల్గొన్నారు.