నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఆశాలకు మార్చి నెల పారితోషికాలు, పల్స్ పోలియో, లెప్రసీ సర్వే పెండింగ్ డబ్బులు తక్షణమే చెల్లించాలని తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ అనుబంధం) కోరింది. ఈ మేరకు ఆ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు పి.జయలక్ష్మి, రాష్ట్ర నాయకులు పి.మీనా వైద్యారోగ్యశాఖ కమిషనర్ కర్నన్ గురువారం కలిసి వినతిపత్రం సమర్పించారు. మూడు రోజుల్లో చెల్లిస్తామని కమిషనర్ హామీ ఇచ్చినట్టు వారు తెలిపారు. అదే విధంగా సర్క్యులర్ లేకపోయినా మట్టి ఖర్చులకు ఇచ్చిన హామీ ప్రకారం రూ.50 వేలు చెల్లిస్తామని, ఈ మధ్య కాలంలో చనిపోయిన వారి అందజేయాలని తెలిపారన్నారు.