
ఆశా వర్కర్ల సమస్య పరిష్కరించాలని సోమవారం భిక్కనూరు పట్టణంలో గాంధీ జయంతి సందర్భంగా గాంధీ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి నర్సింలు మాట్లాడుతూ ఎనిమిది రోజుల నుండి ఆశ వర్కర్లు సమ్మె నిర్వహిస్తున్న ప్రభుత్వం స్పందించకపోవడం సిగ్గుచేటని, సమస్య పరిష్కరించకుంటే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల ఆశా వర్కర్లు పాల్గొన్నారు.