ఆశ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలి.. 

– గ్రామాలలో ప్రతి 1,000 మందిలో పని చేస్తున్న ఆశ వర్కర్లు. 
– ఆరోగ్య క్షేమాలు చూస్తూ గర్భిణీ స్త్రీలను ప్రభుత్వ ఆసుపత్రికి చరవేస్తున్న ఆశాలు.
– వారికి తగిన న్యాయం చేయాలంటూ డిమాండ్ చేసిన సిఐటియు నాయకులు.
నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
ఆశా వర్కర్లు గ్రామాలలో ప్రతి 1,000 మంది జనాభాలో ఒకరుగా పనిచేస్తూ వారి ఆరోగ్య క్షేమాలను చూస్తూన ఆశ వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని శ్రామిక మహిళా జిల్లా కార్యదర్శి  చెరుకు యాక లక్ష్మి అన్నారు. సోమవారం ఆశ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వారి ఆరోగ్యాలను కాపాడే ఆశా వర్కర్లను ప్రభుత్వం వారి సమస్యలు పట్టించుకోవడం లేదు అని అన్నారు. ప్రతి ఒక్క ఆశ వర్కర్ కి  పి ఏసి సౌకర్యం లేదు ఆరోగ్యానికి సంబంధించి హెల్త్ కార్డు కూడా లేదు అని అన్నారు.గత మూడు సంవత్సరాల నుంచి వాళ్లకు యూనిఫామ్స్ ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆశ వర్కర్ల ఎగ్జామ్స్ పెట్టాలని నిర్ణయించడం సరైన పద్ధతి కాదని అన్నారు.గత 20 సంవత్సరాలుగా ఆశా వర్కర్లుగా పనిచేస్తున్న వారిపై ఈ ఎగ్జామ్స్ పేరుతో తొలగించాలని కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తుందని అన్నారు.వారికి మట్టి ఖర్చులకు 50,000 ఇస్తానన్న ప్రభుత్వం ఇప్పటివరకు ఏ ఆశా వర్కర్ చనిపోయిన ఒక రూపాయి కూడా ఇవ్వనటువంటి పరిస్థితి ఉన్నది వారికి ఆరోగ్య భద్రత కల్పించి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఐదు లక్షలు ఇవ్వాలని వారికి పెన్షన్ సౌకర్యం ఈఎస్ఐపిఎఫ్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. అలాగే వారిపై పై అధికారుల ఒత్తిడీలు తగ్గించి పని భారం తగ్గించాలని అన్నారు. అనంతరం 24 డిమాండ్ల తో కూడిన వినతి పత్రాన్ని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ కి అందజేశారు. ఈ కార్యక్రమానికి ఆశా వర్కర్లు కవిత, హుస్సేన్, పద్మా, తులసి, రాధా, నాగమణి ,సంధ్య, విజయ, లింగమ్మ, వాణి, ముత్యాల, రాణి, కనకమ్మ, వాణి, పద్మ, పద్మశ్రీ, రమణ, లింగమ్మ, తదితరులు పాల్గొన్నారు.