నవతెలంగాణ-మిర్యాలగూడ
ఆశా వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం 18వేలు ఇవ్వాలని సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి డాక్టర్ మల్లు గౌతమ్ రెడ్డి ఐద్వా జిల్లా అధ్యక్షురాలు పోలబోయిన వరలక్ష్మి జిల్లా నాయకులు తిరుపతి రామ్మూర్తి డిమాండ్ చేశారు. తమ డిమాండ్లు నెరవేర్చాలని ఆశా వర్కర్లు చేపట్టిన సమ్మె శనివారం ఆరవ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఆశా వర్కర్లు ఫిక్స్డ్ వేతనం 18 వేలు నిర్ణయించాలన్నారు. పిఎఫ్, ఈఎస్‌ఐ, ప్రమాద బీమా, రిటైర్మెంట్ బెనిఫిటిస్ డిమాండ్స్ నెరవేర్చాలన్నారు. రాష్ట్రంలో అనేక పోరాటాలు చేశారని, కలెక్టర్, డీఎంహెచ్‌ఓ ఆఫీసుల ముందు అనేకసార్లు ధర్నాలు చేశారన్నారు. ఆశా వర్కర్లకు పిఎఫ్, ఇఎస్‌ఐ, ప్రమాద బీమా, ఉద్యోగ భద్రత, హెల్త్ కార్డులు, ప్రమాద బీమా, ఐదు లక్షలు రూపాయలు ఆశాలకు రిటైర్మెంట్ బెన్ఫి ట్స్ ఇవ్వాలన్నారు. అర్హులైన ఆశాలను ఏఎన్‌ఎంలుగా పదోన్నతి కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆశాల జీతాలు పెంచకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి రాగిరెడ్డి మంగారెడ్డి, రమేష్, మాధవరెడ్డి, ,ఆశా వర్కర్ల యూనియన్ జిల్లా కార్యదర్శి స్వర్ణ, ఎస్కే తహెరా, మంగతారు, నాగలక్ష్మి, జ్యోతి, రాజేశ్వరి, గోపిక, సరిత, రజిత ,సరస్వతి, తదితరులు పాల్గొన్నారు.