నవతెలంగాణ – అచ్చంపేట
ఆశా కార్యకర్తలకు కనీస వేతనం 18000 ఇవ్వాలని ఆ సంఘం నాయకురాలు రజిత డిమాండ్ చేశారు. శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణకు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం తన మేనిఫెస్టోలో పొందుపరిచిన హామీలను వెంటనే అమలు చేయాలన్నారు. గత 20 ఏళ్ల నుంచి గ్రామీణ ప్రాంతాల్లో పేద ప్రజలకు అందుబాటులో ఉంటూ వైద్య సేవలు అందిస్తున్న ఆశా కార్యకర్తలకు పరీక్ష పేరుతో తొలగించాలని ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.గతంలో ఇచ్చినట్టుగానే ఆశా వర్కర్ల వేతనాలు ప్రతినెల ఐదో తారీకు లోపు వారి అకౌంట్లో జమ చేయాలని కోరారు. ఆశా వర్కర్లకు ప్రమాద భీమా సౌకర్యాన్ని కల్పించాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని ఇస్తున్న పారితోషికంలో సగం పెన్షన్ రూపంలో ఇవ్వాలని ప్రభుత్వాన్ని వారు డిమాండ్ చేశారు ఆశాలకు ప్రతి సంవత్సరం 20 రోజులతో వేతనం కూడిన ప్రభుత్వం ఇవ్వాలని, 6 నెలలతో కూడిన మెడికల్ సెలవులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమస్యలను పరిష్కరించకపోతే.. చలో హైదరాబాద్ కమిషనరేట్ కార్యాలయాన్ని ముట్టడి చేస్తామని ప్రభుత్వాన్ని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో శివ లీల మణెమ్మ, లక్ష్మి ,నిర్మల ,కల్పన, సుజాత ,అలివేల, బాలమణి తదితరులు పాల్గొన్నారు.