నవతెలంగాణ-రామగిరి : రామగిరి మండల కేంద్రంలోని యూనియన్ బ్యాంక్ (రత్నాపూర్ శాఖ) నూతన మేనేజర్ గా ఆశిష్ గోర్మాస్ మహారాష్ట్రలోని నాగపూర్ నుండి బదిలీపై వచ్చి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.. రైతులకు క్రాప్ లోన్లు, అదేవిధంగా గోల్డ్ లోన్లు, రిటైల్ లోన్లు, హౌస్ లోన్లు, ఎడ్యుకేషన్ లోన్లు, పర్సనల్ లోన్లు, మార్ట్ గేజ్ లోన్లు, సిసి లోన్లు, ముద్ర లోన్లు, వర్కింగ్ క్యాపిటల్ లోన్లు, వివిధ రకాల లోన్లు అతి తక్కువ సమయంలో అందజేస్తామని ఆయన అన్నారు. అలాగే ఇక్కడ పని చేసే అసిస్టెంట్ మేనేజర్ చైతన్య కృష్ణ వచ్చిన మేనేజర్ కు స్వాగతం పలికి తన అభినందనలు తెలిపారు.