కేఆర్‌ఎంబీ కొత్త చైర్మెన్‌గా అశోక్‌ ఎస్‌.గోయల్‌

కేఆర్‌ఎంబీ కొత్త చైర్మెన్‌గా అశోక్‌ ఎస్‌.గోయల్‌– రేపు శివనందన్‌కుమార్‌ ఉద్యోగ విరమణ
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌
కృష్ణానది యాజమాన్య బోర్డు(కేఆర్‌ఎంబీ) కొత్త చైర్మెన్‌గా అశోక్‌ ఎస్‌.గోయల్‌ నియమతులయ్యారు. కేంద్ర జలశక్తి శాఖలో సీనియర్‌ ఇంజినీర్‌గా, అధికారిగా విధులు నిర్వర్తిస్తున్నారు. మెకానికల్‌ ఇంజినీరింగ్‌లో పట్టా తీసుకున్నారు. ఈ మేరకు గురువారం కేంద్ర జలశక్తి శాఖ సీనియర్‌ అధికారి నరిందర్‌కుమార్‌ ఆదేశాలు జారీచేశారు. ఇప్పటివరకు చైర్మెన్‌గా వ్యవహరించిన శివనందన్‌కుమార్‌ శుక్రవారం పదవీ విరమణ చేయనున్నారు.