బ్లాక్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శిగా అశోక్ యాదవ్

–  బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు యాదవ రెడ్డి
 నవతెలంగాణ-నెల్లికుదురు : మండలంలోని ఎర్రబెల్లి గూడెం గ్రామానికి చెందిన గుండెబోయిన అశోక్ యాదవ్ కి బ్లాక్ కాంగ్రెస్ జిల్లా కార్యదర్శిగా నియమించినట్లు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఏదేళ్ల యాదవ రెడ్డి తెలిపాడు గురువారం ఆయనకు ఆ పార్టీ మండల అధ్యక్షుడు గొల్లపల్లి ప్రభాకర్ గౌడ్ తో కలిసి నియామక పత్రాన్ని అందించే కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ చురుకైన వ్యక్తిగా ఉండి పార్టీ అభివృద్ధికి కృషి చేసినందుకు ఈ నియామక పత్రాన్ని అందిస్తున్నట్లు తెలిపారు నూతన కార్యదర్శులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని అన్నారు రాబోయే ఎన్నికల్లో పార్టీ గెలుపుకు ప్రధాన పాత్ర పోషిస్తానని అన్నారు సహకరించిన మండల జిల్లా నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు గొల్లపల్లి ప్రభాకర్ గౌడ్  మండల  ఉపాధ్యక్షుడు బండారు మల్లయ్య  ప్రధాన కార్యదర్శి సొంటి రెడ్డి అశోక్ రెడ్డి  గ్రామ యూత్ అధ్యక్షులు పనికర ఉపేందర్ నాయకులు గుండెబోయిన బాలకృష్ణ  గుండెబోయిన శ్రీశైలం  దేవేందర్ గుండెబోయిన హరికృష్ణ  ప్రమోదు నర్రవుల కిరణ్ గుండెబోయిన శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు