ఆశ్రమ పాఠశాల ఆకస్మిక తనిఖీ..

నవతెలంగాణ -పెద్దవూర
మండల కేంద్రంలోని ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలను బుధవారం డీటీడీవో రాజ్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు.ఈ సందర్భంగా పదో తరగతి విద్యార్థులకు అమరవుతున్న వంద రోజులు ప్రత్యేక ప్రణాళికను పరిశీలించారు. ఉపాధ్యాయులు విద్యార్థుల హాజరు పట్టికను పరిశీలించారు. విద్యార్థులతో మెనూ విషయాలు అడిగి తెలుసుకొని సంతృప్తి వ్యక్తం చేశారు.అనంతరం మాట్లాడుతూ విద్యార్థులు మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్ వంటి సీజనల్ వ్యాధులకు గురికాకుండా చర్యలు తీసుకోవాలని ప్రధానోపాధ్యాయులకు ఆదేశాలు ఇచ్చారు.మెనూ ప్రకారం ఆహారాన్ని వేడిగా విద్యార్థులకు వడ్డించాలని, వార్డెన్ ను ఆదేశించారు.తరగతి గదులను సందర్శించి విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడి వారి నైపుణ్యాలను పరీక్షించడం జరిగింది. అదేవిధంగా పాఠశాల రికార్డులను పరిశీలించి తగు సూచనలు చేయడం జరిగింది.పదవ తరగతి లో ప్రతి విద్యార్థి కి ఎక్కువ జిపిఏ సాధించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ప్రన్సిపాల్ బాలాజీ నాయక్, వార్డెన్ బాలకృష్ణ, ఉపాధ్యాయులు రాంరెడ్డి, కృష్ణ, షబ్బీర్, సంధ్య, సురేందర్, సైదులు, శాంతి పాల్గొన్నారు.