
ముధోల్ మండలంలోని ఆష్ట గ్రామంలో రెండు రోజుల క్రితం తల్లిని కొడుకు చంపటంతో నిందితుడు పిల్లలు ఆనాదలుగా మారారు. దీంతో ఈవిషయం తెలుసుకున్న తహశీల్దార్ శ్రీకాంత్, తన సిబ్బందితో సోమవారం గ్రామానికి వచ్చి అనాధ అయిన పిల్లల ఘోరమైన స్థితిని చూసి చలించిపోయారు. రేషన్ కార్డులో ఇబ్బందుల విషయంలో అక్కడే సంతకం చేసి రేషన్ కార్డుకు లెటర్ ఇచ్చారు. అంతే గాకుండా తహశీల్దార్ తనవంతుగా పిల్లలకు రూ.5000 నగదు తోపాటు 25 కేజీల బియ్యాన్ని అందజేసి మానవత్వం చాటుకున్నారు. పిల్లల చదువుల విషయంలో ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని తహశీల్దార్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ అశోక్, యువ నాయకుడు రావుల శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.