అశ్వారావుపేట నియోజక వర్గం ఓటర్లు 1,53,757..

– మహిళా ఓటర్లు ఏ అధికం…
– వివరాలు ప్రకటించిన తహశీల్ధార్ క్రిష్ణ ప్రసాద్.
నవతెలంగాణ – అశ్వారావుపేట :
ఓటరు తుది జాబితాను జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల బుధవారం విడుదల చేశారు.  రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సంఘం ప్రకటించిన ప్రత్యేక ఓటరు జాబితా సవరణ -2 ప్రణాళిక పూర్తి అయ్యిందని చెప్పారు.   పోలింగ్ కేంద్రాల గుర్తింపు, నూతన పోలింగ్ కేంద్రాల ఏర్పాటుతో పాటు ఓటరు జాబితా సవరణ, ముసాయిదా ఓటరు జాబితా విడుదల, జాబితాల పై అభ్యంతరాల స్వీకరణ, ప్రత్యేకంగా ఓటు నమోదుకు శిబిరాల నిర్వహణ, ఓటు నమోదు, తొలిగింపులు, మార్పులకు దరఖాస్తులు స్వీకరణ వంటి కార్యక్రమాలు నిర్వహించామని చెప్పారు. ఈ క్రమంలో అశ్వారావుపేట నియోజక వర్గం ఓటర్లు తుది జాబితా వివరాలను తహశీల్ధార్ క్రిష్ణ ప్రసాద్ అశ్వారావుపేట లో తన కార్యాలయంలో వెల్లడించారు.  నియోజక వర్గం వ్యాప్తంగా ఐదు మండలాల్లో 184 పోలింగ్ కేంద్రాల్లో 153757 మంది ఓటర్లు ఉన్నట్లు చెప్పారు. వీరిలో 75080 మంది పురుషులు,78671 మంది మహిళలు, 06 మంది ట్రాన్స్ జెండర్ లు  ఉన్నట్లు చెప్పారు. ఓటరు జాబితాలో 2047 మంది దివ్యాంగులు, 4117 మంది 18-19 వయస్సు గ్రూపు వారు, 2090  మంది 80 సంవత్సరాలు పైబడిన వయో వృద్ధులను గుర్తించినట్లు చెప్పారు. ఎన్ ఆర్ ఐ లు 06 మంది, 51 మంది సర్వీస్ ఓటర్లు ఉన్నట్లు చెప్పారు. ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరిని తహశీల్ధార్ క్రిష్ణ ప్రసాద్  ప్రత్యేకంగా అభినందించారు.