నవతెలంగాణ – అశ్వారావుపేట
నియోజక వర్గం లోని దమ్మపేట లో ఏర్పాటు చేయడం దానిని మార్చి 2 వ తేదీ( శనివారం) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జ్, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వేణుగోపాల్ ప్రారంభిస్తున్న క్రమంలో స్థానిక న్యాయవాదులు ఉడతనేని శ్రీనివాసరావు, లక్కినేని నరేంద్ర బాబు, మారం సతీష్, తుమ్మ రాంబాబు, సుధాకర్, సంజయ్ అరుణ, ముడుపు నాగ వెంకటరమణ లు హర్షం వ్యక్తం చేసారు. గురువారం వారు విలేఖర్లతో మాట్లాడుతూ ఈ కోర్టు ప్రారంభానికి హైకోర్టు జడ్జిలు జస్టిస్ భీమపాక నగేష్,కే.శరత్ లు హాజరు అవుతారని, కొత్తగూడెం జిల్లా ప్రధాన జడ్జి శ్రీ వసంత పాటిల్ పర్యవేక్షణలో ఈ కార్యక్రమం నిర్వహిస్తారని తెలిపారు. కోర్టు ఏర్పాటు కు కృషిచేసిన జిల్లా మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ, తాజా ఎమ్మెల్యే లు మెచ్చా నాగేశ్వరరావు, జారే ఆదినారాయణ లకు ధన్యవాదాలు తెలిపారు.