
నవతెలంగాణ – అశ్వారావుపేట
ఐటీడీఏ పాలకమండలి సమావేశంలో అశ్వారావుపేట మండలంలో అపరిస్క్రుతంగా సమస్యలను ఎంపీపీ శ్రీరామమూర్తి లేవనెత్తారు. భద్రాచలంలోని ఐటీడీఏ కార్యాలయం సమావేశం ప్రాంగణంలో పీఓ ప్రతీక్ జైన్ అధ్యక్షతన ఆదివారం నిర్వహించిన ఐటిడిఎ పాలకమండలి సమావేశంలో తెలంగాణ ఉపముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు,రోడ్లు మరియు భవనాలు శాఖ మంత్రి కోమటరెడ్డి వెంకటరెడ్డి ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు.ఈ పాలక మండలి సమావేశంలోనే పాల్గొన్న అశ్వారావుపేట ఎం.పి.పి జల్లిపల్లి శ్రీరామమూర్తి మండలంలోని పోడు భూములకు మిగిలిన పట్టాలు ఇవ్వాలని,గరుకులాల పాఠశాలలు,కళాశాలలకు నూతన భావనలను నిర్మించాలని,అలాగే మండలంలోని గ్రామాలలో పలు చోట్ల నూతన బ్రిడ్జి లను మంజూరు చేయాలని,ప్రభుత్వ హాస్పిటల్ లో నిపుణులైన వైద్యులను,సిబ్బందిని,108 అత్యవసర వాహనాన్ని సమకూర్చాలని విన్నవించారు.ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రియాంక అల, భద్రాచలం ప్రాజెక్టు పరిధిలోని ఎం.పి లు,ఎమ్మెల్యేలు,స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.